బుల్లితరపై ఎన్టీఆర్ 'బిగ్‌బాస్' షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకి ఎన్టీఆర్ ఒప్పుకోవడం వెనుక పెద్ద కథే ఉందట. ఏదో ఆషామాషీగా 'బిగ్‌బాస్' రియాల్టీ షో కోసం ఎన్టీయార్ ఓకే చెప్పెయ్యలేదు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్తదనం కోసం ఎన్టీయార్ ఈ ప్రయత్నం చేయాలనుకున్నాడట. ప్రపోజల్‌తో స్టార్ మా యాజమాన్యం తన వద్దకు రాగానే, ఎన్టీయార్ ఒకటికి పదిసార్లు ఆలోచించుకుని ఆ తర్వాతే ఓకే చెప్పాడని సమాచారమ్. ఈ షో కోసం ఎన్టీఆర్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనీ టాక్ నడుస్తోంది. అయితే ఇక్కడ భారీ రెమ్యునరేషన్ అనేది సెకెండరీ థింగ్ అనీ, ముందుగా ఎన్టీయార్ 'గేమ్ ఛేంజర్' అనే కోణంలో ఆలోచన చేశాడని తెలియవస్తోంది. అక్కినేని నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై సరికొత్త గ్లామర్ అద్దడంతో, ఆ దిశగా తానూ కొత్తగా ట్రై చేయవచ్చుననే ఉద్దేశ్యంతోనే 'బిగ్‌బాస్' రియాల్టీ షోకి ఓకే చెప్పాడట. సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీయార్ బుల్లితెరపైకి రానుండడం వెనుక ఇంత పెద్ద కథ ఉంది. ఏదేమైతేనేమి ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయడం ఆయన ఫ్యాన్స్‌కి దిల్ ఖుషీ అయిన మాటే. 'జైలవకుశ' సినిమాతో త్వరలో మన ముందుకు రానున్నాడు జూనియర్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది త్రిపాత్రాభినయం కావడంతో అదో పెద్ద స్పెషల్. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఒకేసారి ఎన్టీఆర్ నుండి రాబోతున్న ఈ సర్‌ప్రైజింగ్స్ వెనక స్టోరీలేమైనా కానీ ఫ్యాన్స్‌కి మాత్రం ఫుల్ పండగే.