ఈమధ్య కాలంలో టాలీవుడ్ సర్కిల్ లో బాగా వినిపిస్తున్న పేరు.. సుధశా కొంగర. `ఆకాశమే నీ హద్దురా` సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించింది సుధా. ఆ సినిమాతో సుధా టాలెంట్ ఏమిటో స్టార్ హీరోలకు అర్థమైంది. అందుకే... తనతో పనిచేయాలని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇటీవల మహేష్ బాబుకి సుధ ఓ కథ వినిపించిందని ప్రచారం జరిగింది. అది ఏమైందో తెలీదు. ఇప్పుడు ప్రభాస్ పేరు కూడా చర్చల్లోకి వస్తోంది.
ప్రభాస్ కోసం సుధ కొంగర ఓ కథ సిద్ధం చేసిందని, ఆ స్క్రిప్టు ప్రభాస్ కి కూడా పంపించిందని, ఆ స్క్రిప్టు ప్రభాస్ కి నచ్చిందని టాక్. అయితే హీరోలు కథలు వింటున్నా.న.. ఎవరూ కమిట్ కాకపోవడం సుధా కొంగర బ్యాడ్ లక్. మహేష్ 2025 వరకూ బిజీనే. ప్రభాస్ పరిస్థితీ అంతే. ఇలాంటి బిజీ హీరోలకు కథలు చెప్పడం వల్ల... ఎలాంటి ఉపయోగం లేదు. వీళ్లనేకాదు.. స్టార్ హీరోల్లో చాలామంది బిజీగా ఉన్నారు. వాళ్ల కమెట్మెంట్స్ వాళ్లకున్నాయి. స్టార్ తోనే చేయాలంటే సుధాకొంగర ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిందే.