టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది. అదే.. నందమూరి బాలకృష్ణ - అనిల్ రావిపూడి. `అఖండ` తరవాత.. ఈ కాంబోనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇదో మల్టీస్టారర్ సినిమా అని, ఇందులో కల్యాణ్ రామ్ కూడా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. బాలయ్య- కల్యాణ్ రామ్ ల కాంబో తెరపై చూడాలని చాలా కాలం నుంచి నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ న్యూస్ తో వాళ్లంతా ఖుషీ అవుతున్నారు. అయితే ఇంతలోనే.. ఓ బాంబు పేల్చాడు అనిల్ రావిపూడి.
ఇది మల్టీస్టారర్ కాదని, ఇందులో కల్యాణ్ రామ్ లేడని తేల్చేశారు. ఇది బాలయ్య సోలో సినిమానే. మల్టీస్టారర్ కాదని వివరణ ఇచ్చారు. కల్యాణ్ రామ్ తో తప్పకుండా మరో సినిమా చేస్తానని, ఈసారి మాత్రం బాలయ్య సోలోగానే దర్శనమిస్తారని వివరించారు. రవితేజ, మహేష్ బాబులతో కూడా ప్రాజెక్టులు ఉన్నాయని, వాళ్ల కోసం కూడా కథలు రాస్తున్నానని చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. బాలయ్య సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకొన్ని రోజుల్లో బయటకు వస్తాయి.