రాకెట్‌ చేతపట్టి 'దోచేశాడు'.!

By iQlikMovies - November 14, 2018 - 10:27 AM IST

మరిన్ని వార్తలు

విలక్షణ నటుడు సుధీర్‌బాబు ఎంచుకునే కథలు కూడా చాలా విలక్షణంగా ఉంటాయి. ఇటీవల 'సమ్మోహనం', 'నన్ను దోచుకుందువటే' చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన సుధీర్‌బాబు, ప్రముఖ బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 

సినిమాల్లోకి రాకముందు సుధీర్‌బాబు ప్రొఫెషనల్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. పలు నేషనల్‌ టోర్నమెంట్స్‌లో ఆడిన అనుభవం ఉంది. అయితే సినిమాల్లోకి వచ్చాక రాకెట్‌ విడిచిపెట్టేశాడు. మళ్లీ సినిమా కోసమే రాకెట్‌ చేతపట్టాడు సుధీర్‌బాబు. ఈ సినిమా కోసం అప్పుడు వదిలేసిన రాకెట్‌ని మళ్లీ చేతబట్టి శిక్షణ తీసుకుంటున్నాడు. తాజాగా కోర్టులో బ్యాడ్మింటన్‌ ఆడుతున్న వీడియోని సుధీర్‌బాబు ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. సుధీర్‌బాబు ఆట తీరుకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. 

గతంలో గోపీచంద్‌ దగ్గరే సుధీర్‌బాబు ట్రైనింగ్‌ తీసుకున్నారు. అలా ఆయన గురువు బయోపిక్‌లో తాను నటిస్తుండడం అదీ లీడ్‌ రోల్‌ పోషిస్తుండడంపై సుధీర్‌బాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. డిశంబర్‌లో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా, కోచ్‌గా ఈ స్థాయిలో నిలబడేందుకుగానూ గోపీచంద్‌ తన జీవితంలో ఎదుర్కొన్న అసాధారణ పరిస్థితుల్ని ఎంతో హృద్యంగా తెరకెక్కించనున్నారట. 

మరోవైపు లేడీ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ కూడా రూపొందుతోంది. శ్రద్ధాకపూర్‌ ఈ బయోపిక్‌లో లీడ్‌రోల్‌ పోషిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS