విలక్షణ చిత్రాల నటుడిగా, తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరో సుధీర్‌బాబు. కేవలం హీరోగానే కాకుండా, విభిన్న తరహా పాత్రలైతే గెస్ట్ రోల్స్‌లో నటించేందుకూ సుధీర్‌బాబు సిద్ధమే. హీరోగా వరుస సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే సుధీర్‌బాబు, నిర్మాతగానూ సత్తా చాటుతున్నాడు.
ఇటీవలే సొంత బ్యానర్‌లో 'సమ్మోహనం' సినిమాను రూపొందించి మంచి విజయం అందుకున్నాడు సుధీర్‌బాబు. త్వరలోనే 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆల్రెడీ రిలీజైన్ ఈ సినిమా టీజర్‌తో సగం ప్రేక్షకుల మనసులు దోచేశాడు. తాజాగా మరో సినిమాని పట్టాలెక్కించబోతున్నాడీ ఘట్టమనేని వారి అల్లుడు. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో అందాల భామ మెహరీన్ హీరోయిన్‌గా ఎంపికైంది.
ఈ శుక్రవారం సినిమాని హైద్రాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది చిత్ర యూనిట్. పులి వాసు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కూడా విభిన్న కథా, కథనాలతో రూపొందుతోన్న చిత్రమేనట.
ఇలా ఓ పక్క నిర్మాతగానూ, మరో పక్క హీరోగానూ సుధీర్‌బాబు ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. మెహరీన్ విషయానికి వస్తే, ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్‌తో 'ఎఫ్ 2 - ఫన్ అండ్ ఫ్రస్టేషన్' చిత్రంలో నటిస్తోంది.