ఇకపై విజయ్ దేవరకొండని 'అర్జున్‌రెడ్డి'గా జనం మర్చిపోవచ్చు. ఎందుకంటే ఇప్పటి నుండి అతను 'గోవిందుడు'. విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం'. నేడే ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమాలో విజయ్ దేవరకొండ గోవింద్ పాత్రలో ఒదిగిపోయాడు. నటించడం కాదు, జీవించేశాడు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్.
అందుకే ఓవర్సీస్‌లో ఆడియన్స్ ఈ సినిమాకు బ్రహ్మరధం పట్టేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ఖరారైపోయాయి. ఏపీ, తెలంగాణ, ఓవర్సీస్ ఇలా అంతటా విజయ్ దేవరకొండ గురించి చర్చలు మొదలెట్టేస్తున్నారు. పరశురామ్ ఈ సినిమా దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఛలో'తో సూపర్ హిట్ అందుకున్న కన్నడ బ్యూటీ రష్మికా మండన్నా ఇప్పుడు 'గీత'గా 'గీత గోవిందం' సినిమాతో మరో బంపర్ హిట్ అందుకుంది. వీరిద్దరికీ ఈ సినిమా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయ్ దేవరకొండ విషయానికి వస్తే, 'అర్జున్‌రెడ్డి'లో రఫ్‌గా కనిపించిన ఈ యంగ్ హీరో ఈ సినిమాలో గుడ్‌బోయ్‌లా కనిపించి మెప్పించాడు. అర్జున్‌రెడ్డి గురించి ఎలా చెప్పుకున్నామో, ఇకపై గోవింద్ గురించి అలాగే చెప్పుకుంటాం.