రక్షకుడేంటీ భక్షకుడిలా ఉన్నాడు.?

By Inkmantra - January 27, 2020 - 11:30 AM IST

మరిన్ని వార్తలు

'కృష్ణుడు గీతలో ఎప్పుడో చెప్పాడు.. రాక్షసుడు ఎదిగిన నాడు ఒకడొస్తాడు.. 'రక్షకుడు' వస్తున్నాడు అంటూ రక్షకుడు లుక్‌ గురించి హింట్‌ ఇచ్చిన సుధీర్‌ బాబు లుక్‌ రానే వచ్చింది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వి' చిత్రంలో సుధీర్‌ బాబు రక్షకుడిగా అంటే హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రక్షకుడి లుక్‌నే తాజాగా రిలీజ్‌ చేశారు. అయితే, 'రక్షకుడు' లుక్‌లో రాక్షకుడు కనిపిస్తున్నాడంటూ కామెంట్స్‌ వస్తున్నాడు. నెగిటివ్‌ అప్పీల్‌ కనిపిస్తోందంటూ ఫ్యాన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో రాక్షసుడు నాని. అంటే విలన్‌ పాత్రలో నాని కనిపించనున్నాడు.

 

ఆ లుక్‌ రేపే అనగా జనవరి 28న రిలీజ్‌ చేయనున్నారు. అయితే, మొదటిగా వచ్చిన రక్షకుడు, భక్షకుడిలా కనిపిస్తుండడం ఫ్యాన్స్‌ని కలవర పెడుతోంది. అంటే హీరో పాత్రలోని పవర్‌ అనుకోవాలా.? హీరోనే ఇంత టిపికల్‌గా ఉన్నాడంటే, ఆ పక్క ఉన్న విలన్‌ ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉంటాడో అని కూడా భావిస్తున్నారు. విలన్‌ పాత్ర ఎంత కఠినంగా ఉంటే, హీరో పాత్రలో పవర్‌ అంత ఎక్కువగా ఎలివేట్‌ అవుతుంది. అంటే నాని క్యారెక్టర్‌ని చాలా కఠినంగా డిజైన్‌ చేసి ఉంటాడు డైరెక్టర్‌. మొత్తానికి ఎలా ఉంటేనేం, 'రక్షకుడు' అయితే వచ్చేశాడు. ఆ 'రాక్షసుడు' కూడా వచ్చేస్తే, ఆడియన్స్‌ ఓ అభిప్రాయానికి వచ్చేస్తారు. అక్కడి వరకూ రావాలంటే, మరికొన్ని గంటలు వెయిట్‌ చేయాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS