పుల్లెల గోపీచంద్ బయోపిక్ గురించి చాలా రోజుల నుంచీ చర్చ నడుస్తోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ బయోపిక్ పట్టాలెక్కుతుందన్నారు. కానీ... రోజు రోజుకీ ఆలస్యం అవుతూనే వుంది. `వి` తరవాత ఈ బయోపిక్ ని సుధీర్ బాబు టేకప్ చేస్తాడని అన్నారు. కానీ.. `వి` తరవాత.. పలాస దర్శకుడు కరుణ కుమార్ కథకి ఓకే చెప్పాడు. మరోవైపు ప్రవీణ్ సత్తారు నాగ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.
ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ పై అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ బయోపిక్ ఉంటుందా? ఉన్నా.. దర్శకుడు మారతాడా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే వీటిపై ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చింది. ఈ బయోపిక్ ఉంది. చేతులు కూడా మారలేదు. సుధీర్ బాబు - ప్రవీణ్ సత్తారు కాంబోలోనే ఈ బయోపిక్ రూపొందుతుంది. డిసెంబరులో ఈ చిత్రాన్ని మొదలెట్టాలని ప్రవీణ్ సత్తారు భావిస్తున్నాడు. ఈ సినిమా అయ్యాకే.. నాగార్జునతో సినిమా మొదలెడతాడట ప్రవీణ్. ఈ బయోపిక్ కోసం ఇప్పటికీ కసరత్తులు చేస్తూనే ఉన్నానని, దీన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నామని సుధీర్ బాబు తెలిపాడు. ఈ బయోపిక్‌కి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.