అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `పుష్ష`. నవంబరు నుంచి కొత్త షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ సినిమాలో నారా రోహిత్ కూడా నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. పుష్షలోని ఓ కీలక పాత్ర కోసం రోహిత్ ని చిత్రబృందం సంప్రదించిందని సమాచారం. ప్రస్తుతం రోహిత్‌కీ, పుష్ష టీమ్ కీ మధ్య చర్చలు జరుగుతున్నాయి.
ఈ పాత్రలో నారా రోహిత్ అయితే బాగుంటుందని బన్నీనే సలహా ఇచ్చాడట. బన్నీ సినిమా, పైగా సుకుమార్ లాంటి క్రియేటీవ్ దర్శకుడు.... రోహిత్ నో చెప్పడానికి ఛాన్సులే లేవు. త్వరలోనే నారా రోహిత్ ఎంట్రీపై ఓ అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఈమధ్య హీరోగా నారా రోహిత్ కి హిట్లు లేవు. ఓ మంచి సినిమాతో.. కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాలని భావిస్తున్నాడు. ఆ ఇన్నింగ్స్ పుష్ష సినిమాతోనే మొదలు కావొచ్చు.