చాలామంది అనామకుల్ని స్టార్లుగా మార్చింది జబర్‌దస్త్. విచిత్రం ఏమిటంటే.. స్టార్సయ్యాక జబర్‌దస్త్‌ని వదిలి వెళ్లి.. వేరే కుంపటి పెట్టినవాళ్లే ఎక్కువ. ఈమధ్య సుధీర్ కూడా అదే చేశాడు. జబర్‌దస్త్ తో సుధీర్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 12 ఏళ్లపాటు... జబర్‌దస్త్ తో నవ్వించాడు. ఇటీవల జబర్దస్త్ ని వీడి వెళ్లిపోయాడు. ఈటీవీతో కూడా దాదాపుగా తెగదెంపులు చేసుకొన్నట్టు సమాచారం. ఇప్పడు `మా` టీవీతో ఎక్కువగా టచ్‌లో ఉంటున్నాడు. సినిమాల్లోనూ బిజీ. అందుకే ఈటీవీ, జబర్‌దస్త్ వైపుగా మళ్లీ వెళ్లకపోవొచ్చన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై సుధీర్ క్లారిటీ ఇచ్చాడు,
జబర్దస్త్ ని విడిచేది లేదని, ఇది కేవలం విరామమే అని.. స్పష్టం చేశాడు. తన ఆర్థిక పరిస్థితులు, కమిట్‌మెంట్స్ వల్ల.. జబర్‌దస్త్ కి టైమ్ కేటాయించలేకపోతున్నాడని, త్వరలోనే జబర్దస్త్ తెరపై కనిపిస్తానని మాట ఇచ్చాడు. ''నా జీవితాన్ని మర్చింది జబర్దస్త్. నా లైఫ్ మొత్తం మారిపోయింది. దాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. త్వరలోనే మళ్లీ జబర్దస్త్ లో కనిపిస్తా. ఈ విషయంలో మల్లెమాలతో కూడా మాట్లాడా. నేను ఎప్పుడు వెళ్లినా ఈటీవీ తలుపులు తెరచుకొనే ఉంటాయి'' అని చెప్పుకొచ్చాడు సుధీర్. సో.. జబర్దస్త్ లో.. సుధీర్ సుడిగాలి ఎంట్రీ ఖాయమే అన్నమాట.