'రంగస్థలం' సినిమాతో కనీ వినీ ఎరుగని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు డైరెక్టర్ సుకుమార్. విడుదలై నెల దాటేసినా 'రంగస్థలం' వసూళ్ల జోరు కొనసాగుతోంది. డైరెక్టర్‌గా ఈ సినిమా సుకుమార్‌కి కెరీర్ బెస్ట్ మూవీ అని చెప్పాలి. ఈ ఉత్సాహంతోనే సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో సినిమా చేసేందుకు సుకుమార్ సిద్ధమయ్యాడు.
ఆల్రెడీ మహేష్‌బాబు కోసం కథ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాననీ సుకుమార్ తాజాగా వెల్లడించారు. సొంతూరులో ఓ కార్యక్రమం నిమిత్తం వెళ్లిన సుకుమార్ అక్కడి విలేఖర్లతోనే ఈ మాట చెప్పారు. 'రంగస్థలం' రూపొందించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లోనే ఈ సినిమా కూడా రూపొందనుంది. ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌నే ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తారు. ఇంకా మిగిలిన నటీనటుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని సుకుమార్ చెప్పారు.
'రంగస్థలం' బ్లాక్ బస్టర్ స్టోరీ తర్వాత సుకుమార్, సూపర్‌స్టార్ కోసం ఎలాంటి స్టోరీని ప్రిపేర్ చేశాడా అని అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో పక్క 'రంగస్థలం'తో బిగ్ ప్రాఫిట్ అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా సూపర్‌స్టార్‌తో తెరకెక్కించబోయే చిత్రానికి భారీ బడ్జెట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు 'భరత్ అనే నేను' చిత్రం విజయంతో మహేష్‌బాబు కూడా ఫుల్ స్వింగ్ మీదున్నాడు. సో ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో రాబోయే చిత్రం ఖచ్చితంగా సూపర్ సక్సెస్ మూవీనే అవుతుంది. అందులోనూ గతంలో '1-నేనొక్కడినే' సినిమాతో మహేష్‌ని నిరాశపరిచిన సుకుమార్ ఈ సారి ఎలాగైనా హిట్ ఇవ్వాలనే కసితో ఉన్నాడట.