సుకుమార్ లాంటి వాళ్లు మిస్టర్ పర్‌ఫెక్షనిస్టులు అనుకోవాలి. తమ మైండ్ లో మెదిలిన సన్నివేశం.. స్క్రీన్ పై వచ్చేంత వరకూ రాస్తూనే ఉంటారు, తీస్తూనే ఉంటారు. సుకుమార్ అయితే మరీనూ. సెట్లో కూర్చుని కూడా మెరుగులు దిద్దుతుంటాడు. రీషూట్లు అయితే బోలెడన్ని. అయితే పుష్ఫ కోసం సుకుమార్ చాలా మారాడట. సెట్‌కి వెళ్లకముందే స్క్రిప్టుని లాక్ చేసేశాడట. అసలు ఈ స్క్రిప్టులో ఒక్క అక్షరం కూడా మార్చలేకుండా పకడ్బందీగా తయారు చేశాడని తెలుస్తోంది. నిజానికి ఈ సమయంలో ఇది చాలా అవసరం కూడా. మేకింగ్ ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితికి టాలీవుడ్ వచ్చేసింది.
ఒక్కరోజు కాల్షీట్లు వేస్టయినా.. ఆ నష్టాన్ని నిర్మాత భరించలేకపోతున్నాడు. ఈ దశలో సెట్‌కి వెళ్లి సీన్ రాస్తానంటే కుదరదు. పక్కా బౌండ్ స్క్రిప్టుతో వెళ్లాల్సిందే. సుకుమార్ అదే చేస్తున్నాడు. తన కెరీర్‌లో తొలిసారి పక్కా స్క్రిప్టు సిద్ధం చేశాడు. లాక్ డౌన్ సుకుమార్‌కి బాగా కలిసొచ్చింది. ఈటైమ్ ని సద్వినియోగపరచుకుంటూ స్క్రిప్టుని మాడిఫికేషన్ చేశాడట. ఎప్పటికప్పుడు అల్లు అర్జున్‌కి టచ్‌లో ఉంటూ. సన్నివేశాల్ని రాసుకున్నాడట. వేస్టేజీనీ వీలైనంత వరకూ తగ్గించుకున్నాడని టాక్. ఇదంతా నిర్మాతల్ని ఖుషీ చేసేదే. మిగిలిన దర్శకులూ సుకుమార్ రూటులో వెళ్తే.. నిర్మాతలకు అనవసరమైన ఖర్చుల్ని తగ్గించిన వాళ్లవుతారు.