రకుల్‌ ప్రశ్న: మెడికల్‌ షాప్‌లో లిక్కర్ దొరుకుతుందా?

మరిన్ని వార్తలు

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సోషల్‌ మీడియాలో అభిమానులే కాదు, ఆమెను ద్వేషించేవారూ ఎక్కువే. ఓ విషయంలో రకుల్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత, ఆమెకు సోషల్‌ మీడియాలో నెగెటివ్‌ ఫాలోవర్స్‌ ఎక్కువయ్యారు. నిజానికి, తన మీద జుగుప్సాకరమైన ప్రచారం జరగడంతో, దాన్ని ఖండించే క్రమంలో ఆమె కాస్త నోరు జారిందంతే. ‘సెషన్‌’ అంశం చుట్టూ జరిగిన రచ్చ అది. అసలు విషయానికొస్తే, తాజాగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అందులో ఓ షాప్‌ నుంచి ఆమె కొన్ని వస్తువులు కొనుగోలు చేసి, తిరిగొస్తున్నట్లు కన్పిస్తోంది. అయితే, అదంతా లిక్కర్‌ వ్యవహారమని నెటిజన్లు ట్రోలింగ్‌ షురూ చేశారు.

 

ఈ వ్యవహారంపై స్పందించిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మెడికల్‌ షాప్‌లలో మద్యం కూడా విక్రయిస్తారా.? ఆ సంగతి నాకు తెలియదే.! అంటూ తనదైన స్టయిల్లో పేర్కొంది. అంతే, ఒక్కసారిగా హేటర్స్‌ ప్రచారానికి తాళం పడిపోయింది. ఇదిలా వుంటే, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, లాక్‌డౌన్‌ సిట్యుయేషన్‌ని సద్వినియోగం చేసుకుంటోంది. వర్కవుట్స్‌ చేస్తూ, రకరకాల కొత్త విషయాలు తెలుసుకుంటూ, నిత్యం బిజీగా వుంటోంది రకుల్‌. కెరీర్‌ విషయానికొస్తే, నితిన్‌ సరసన రకుల్‌ ఓ సినిమాలో నటించనున్న విషయం విదితమే. లాక్‌డౌన్‌ తర్వాత ఆ సినిమా సెట్స్‌ మీదకు వెళ్ళనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS