పవన్ కల్యాణ్ స్టేజ్‌పై ఉంటే, ఇంకెవరైనా మాట్లాడతారా? ఫ్యాన్స్ మాట్లాడనిస్తారా? ఎవరు మైక్ పట్టుకున్నా `పవర్ స్టార్.. పవర్ స్టార్` అని అరుస్తూనే ఉంటారు. ఏ హీరోకీ ఇంత క్రేజ్ లేదు. ఇలాంటి క్రేజ్, ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ హీరోయిన్ విషయంలో చూశారా? చూసే అవకాశమే లేదు. కానీ.. సాయి పల్లవి ఈ అరుదైన ఫీట్, ఫాలోయింగ్ సాధించింది.
ఆదివారం రాత్రి హైదరాబాద్ లో `ఆడవాళ్లూ మీకు జోహార్లూ` ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి సాయి పల్లవి హాజరైంది. సాయి పల్లవి స్టేజీపై వెళ్తున్నప్పుడు,మైకు అందుకున్నప్పుడు ఫ్యాన్స్ లో ఒకటే గోల. ఆ ఫాలోయింగ్ చూసి స్టేజీపై ఉన్న సుకుమార్ సైతం ఆశ్చర్యపోయారు. అప్పటికప్పుడు `లేడీ పవన్ కల్యాణ్` అంటూ బిరుదు ఇచ్చేశారు. స్టేజీపై సాయి పల్లవితో పాటు రష్మిక, కీర్తి సురేష్ ఉన్నా, ఎవరికీ రానంత అప్లాప్... సాయి పల్లవికి వచ్చింది. సాయి పల్లవి గ్లామర్ హీరోయిన్ కాదు. యువతరానికి నచ్చే ఏ అంశం.. సాయి పల్లవి లో కనిపించవు. అయినా సరే, ఇంత అభిమానం, ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. తన ప్రవర్తన, ఎంచుకునే కథలు, మాట్లాడే తీరు.. ఇవే - తనని లేడీ పవన్ కల్యాణ్ చేసేశాయి.