టాలీవుడ్ డైరెక్టర్లలో సుకుమార్ మోస్ట్ టాలెంటెడ్. క్రియేటీవ్ జీనియస్. తన కథలు, అవి చెప్పే విధానం.. ఆ స్థాయిలో ఉంటాయి. అయితే.. సుకుమార్ ది అంతా చెక్కుడు వ్యవహారం. నిదానంగా పని చేస్తాడు. తీసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ తీస్తుంటాడని ఇండ్రస్ట్రీలో చెప్పుకుంటుంటారు. `రంగస్థలం` కూడా అలా చెక్కీ.. చెక్కీ తీసిందే. అయితే... అదే `రంగస్థలం`ని సూపర్ హిట్ చేసింది. `పుష్ష` విషయంలోనూ అదే ఫార్ములాలో వెళ్లాలనుకుంటున్నాడు. ప్రతీదీ నిదానంగానే ప్లాన్ చేస్తున్నాడు.
అయితే.. సుకుమార్ వర్కింగ్ స్టైల్‌ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు అల్లు అర్జున్. `పుష్ష` విషయంలో చెక్కుడు విధానాన్ని కట్టిపెట్టమని.. బన్నీ క్లారిటీ గా చెప్పేశాడట. కరోనా వల్ల ఇప్పటికే ఈ సినిమా ఆలస్యం అయ్యిందని, సినిమాని నిదానంగా తీస్తూ, ఇంకా ఆలస్యం చేయొద్దని సూచించాడట. ఎట్టిపరిస్థితుల్లోనూ 2021లో `పుష్ష` విడుదల కావాల్సిందే అని బన్నీ అల్టిమేట్టం జారీ చేశాడట. ఎందుకంటే.. బన్నీ చేతిలో చాలా ప్రాజెక్టులున్నాయి. చాలా కథలు బన్నీ కోసం వెయిటింగ్. ఇలాంటప్పుడు ఒకే సినిమాపై రెండేళ్లు కూర్చోవడం కరెక్ట్ కాదన్నది బన్నీ ఆలోచన. ఇప్పుడు పద్ధతి మార్చి, స్పీడు పెంచాల్సింది సుక్కూనే.