రామ్ - పూరి మ‌ధ్య గ్యాప్‌... పారితోషిక‌మే కార‌ణ‌మా?

మరిన్ని వార్తలు

ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ నుంచి సూప‌ర్ హిట్ దిశ‌గా దూసుకుపోతోంది. ఈ ద‌శ‌లో హ్యాపీగా ఉండాల్సిన రామ్‌, పూరిల మ‌ధ్య చిన్న గ్యాప్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అందుకే విడుద‌ల‌కు ముందు, ప్ర‌మోష‌న్ల‌కు రామ్ డుమ్మా కొట్టాడ‌ని, అమెరికా వెళ్లిపోయాడ‌ని తెలుస్తోంది. ఈ గ్యాప్‌కి కార‌ణం.. పారితోషిక‌మే అని టాక్‌. రామ్‌కి రూ.5 కోట్ల పారితోషికం ఇస్తాన‌ని పూరి మాట ఇచ్చిన‌ట్టు కానీ 2.5 కోట్లు మాత్ర‌మే ముట్ట‌జెప్పిన‌ట్టు టాక్‌. మిగిలిన మొత్తం విడుద‌ల‌కు ముందు స‌ర్దుబాటు చేస్తాన‌ని చెప్పాడ‌ట‌.

 

కానీ.. సినిమా బిజినెస్ అయిపోయినా త‌న డ‌బ్బులు ఇవ్వ‌లేద‌ని రామ్ అలిగాడ‌ని తెలుస్తోంది. ఈ విష‌య‌మై పూరిని రామ్ ఎన్నిసార్లు అడిగినా - పూరి ప‌ట్టించుకోలేద‌ని, ఛార్మి కూడా కొన్నిసార్లు క‌టువుగా స‌మాధానం చెప్పింద‌ని టాక్‌. ఇప్పుడు ఈ ఇష్యూ నిర్మాత‌ల మండ‌లి ముందుకెళ్లింద‌ని తెలుస్తోంది. అంతే కాదు.. `మా` లోనూ రామ్ ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌ని స‌మాచారం. సినిమా ఫ్లాప్ అయితే.. ఇలాంటి గొడ‌వ‌లు వ‌స్తుంటాయి. హిట్ అయిన‌ప్పుడు చిన్న చిన్న ఇష్యూలు కూడా స‌ర్దుబాటు అయిపోతాయి. కానీ.. సినిమా హిట్ట‌యినా.. పారితోషికం విష‌యంలో పేచీ రావ‌డం, ఓ ద‌ర్శ‌కుడిపై హీరో అల‌గ‌డం నిజంగా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఈ ఇష్యూని పూరి ఎలా సాల్వ్ చేసుకుంటాడో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS