భారీ అంచనాలతో విడుదలైన సినిమా పుష్ప. దీనికి మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమా ఆశించినంతగా లేదని కొంతమంది అంటే, ఇంకొంతమంది అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్ తో సినిమా నడిపించేశాడని కితాబులు ఇస్తున్నారు. క్లైమాక్స్ పై కూడా రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. కొంతమందికి ఈ క్లైమాక్స్ నచ్చింది. చాలామంది పెదవి విరుస్తున్నారు. సెకండ్ పార్ట్ చూడాలన్న ఉత్సాహం, ఆసక్తి... పార్ట్ 1 కల్పించలేదన్నది విమర్శ.
నిజానికి పుష్ప కోసం సుకుమార్ ప్లాన్ చేసిన క్లైమాక్స్ వేరు. ఫహద్ ఫాజిల్ ఎంట్రీ తో పుష్ప 1కి ముగింపు పలికాడు సుకుమార్. క్లైమాక్స్ లో ఇద్దరూ లో దుస్తులతో నిలబడం షాకిచ్చింది. నిజానికి.. ఇద్దర్నీ బట్టల్లేకుండా నిలబెట్టించాలనుకున్నాడట. బట్టల్లేకపోతే.. ఇద్దరూ ఒక్కటే అని చెప్పడానికి ఆ సీన్ రాసుకున్నాడట. అయితే అది మరీ హెవీ అయిపోతుందని భావించి, దాన్ని లో దుస్తుల వరకూ కుదించాడు. అంతే కాదు.. క్లైమాక్స్ లో ఫాజిల్ - బన్నీ మధ్య ఓ భారీ ఫైట్ కూడా డిజైన్ చేశాడట. అది కూడా అండర్ వేర్ లతో. కానీ... దానికి టైమ్ లేకపోవడం, అప్పటికే యాక్షన్ డోస్ ఎక్కువ అనిపించడంతో.. ఆ ఫైట్ షూట్ చేయలేదట. నిజంగా.. బన్నీని, ఫాజిల్ నీ నగ్నంగా నింపితే.. థియేటర్లో జనాలు ఏమైపోయేవారో..?