నిన్న జరిగిన నితిన్ ‘లై’ ఆడియో విడుదల కార్యక్రమంలో ప్రముఖ దర్శకులైన సుకుమార్, త్రివిక్రమ్ ల మధ్య ఒక ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
మొదట సుకుమార్ మాట్లాడుతూ- ఇండస్ట్రీలో రెండు రకాల దర్శకులు కనపడతారు. అందులో ఒకరు ఎడిటర్ రూమ్ లో సినిమాని దర్శకత్వం చేసేవారు అలానే ఇంకొకరకం ఏంటంటే- అది డైరెక్ట్ గా షూటింగ్ సెట్ లోనే డైరెక్ట్ చేసే వారు అని. ఇందులో తాను ఎడిటర్ రూమ్ డైరెక్టర్ అని లై చిత్ర దర్శకుడ్- హను మాత్రం సెట్ లోనే డైరెక్ట్ చేసే రకం అని చెప్పి అందరి చేత నవ్వులు పూయించాడు.
ఇక ఆ తరువాత మాట్లాడిన త్రివిక్రమ్.. సుకుమార్ ని ఉద్దేశిస్తూ- మీరు చెప్పిన రెండు రకాలే కాదు మరొక రకం కూడా ఉంది. అదే సినిమా రిలీజ్ అయ్యాక చూసుకొని అసలు ఇలా కాకుండా వేరేలా తీస్తే బాగుండేది అని అనుకునే టైపు అని. ఆ కోవలోకే తాను చెందుతాను అని తన స్టైల్ లో హాస్యం పండించాడు.
ఈ మొత్తం సంభాషణని చూసిన, విన్న ప్రేక్షకులకి మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ దొరికింది.