సూప‌ర్ క్రేజీ కాంబో @ 2022

మరిన్ని వార్తలు

టాలీవుడ్ లో మ‌రో క్రేజీ కాంబినేష‌న్ కి రంగం సిద్ధం అయ్యింది. వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతున్న‌ విజయ్ దేవ‌ర‌కొండతో సూప‌ర్ హిట్ల ద‌ర్శ‌కుడు సుకుమార్ క‌ల‌యిక‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనుంది. కేదార్ సెల‌గంశెట్టి నిర్మాత‌. 2022లో ఈ ప్రాజెక్టు ప‌ట్టాలెక్కుతుంది. ఈ విష‌యాన్ని విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలియ‌జేశాడు.

 

``ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ మ‌ర‌చిపోలేని ఓ సినిమా ఇస్తున్నామ‌ని న‌మ్మ‌కంగా చెబుతున్నా`` అంటూ ట్విట్ట‌ర్ లో త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు విజ‌య్‌. ప్ర‌స్తుతం `పుష్ఫ‌` సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్‌. 2021లో ఈ సినిమావ విడుద‌ల అవుతుంది. విజ‌య్ సినిమా 2022లో మొద‌ల‌వుతుంది. ప్ర‌స్తుతం పూరి ద‌ర్శ‌కత్వంలో ఓసినిమాలో న‌టిస్తున్నాడు విజ‌య్. ఆ త‌ర‌వాత మ‌రో్ పాన్ ఇండియా సినిమాని పూర్తి చేయాలి. ఆ త‌ర‌వాతే... పూరి సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS