పుష్పతో సుకుమార్ హిట్టు కొట్టాడా? లేదా అనేది సందిగ్థంలోనే ఉంది. ఎందుకంటే ఈసినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. ఆ తరవాత.. చూస్తే వసూళ్లు కుమ్మేస్తోంది. డివైడ్ టాక్ చూసి యావరేజ్ అనాలా? వసూళ్లు చూసి హిట్ అనాలా? అనేది అర్థం కావడం లేదు. అంతే కాదు.. ఎన్ని వసూళ్లు వచ్చినా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వదన్నది మరో టాక్. ఎటు చూసినా.. ఈ సినిమా అటూ ఇటూ కాని సినిమానే. పుష్ప తరవాత.. వెంటనే పుష్ప 2 పనుల్లో పడిపోతాడు సుకుమార్.
ఆ వెంటనే విజయ్ దేవరకొండతో సినిమా ఉందని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఆమధ్య సుకుమార్ కూడా ఇదే మాట చెప్పాడు. అయితే ఇప్పుడు సుకుమార్ - విజయ్ కాంబో పై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కాంబో లేదని, ఆ స్థానంలో సుకుమార్ మరో సినిమా చేస్తాడని టాక్. పుష్ప 2 అవ్వగానే.. సుకుమార్ ఓ వెబ్ సిరీస్ కోసం ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. 2022 మొత్తం పుష్ప 2కే కేటాయిస్తాడు. ఆ తరవాత వెబ్ సిరీస్ మరో యేడాది అనుకుంటే.. విజయ్ దేవరకొండతో సినిమాకి సమయం ఎక్కడ?? సో.. ఈ కాంబో లేదన్నది విశ్వసనీయ వర్గాల మాట.