ఆర్.ఎక్స్ 100తో కార్తికేయ లైఫ్ మారిపోయింది. పాయల్ రాజ్ పుత్ కి కూడా వరుస అవకాశాలు దక్కాయి. అజయ్ భూపతి అయితే పెద్ద దర్శకుడు అయిపోయాడు. అయితే... కార్తికేయ తరవాత ఈ ముగ్గురికీ హిట్ పడలేదు. వన్ సినిమా వండర్ గా మిగిలిపోయారు. మహా సముద్రం అజయ్ ని బాగా నిరాశ పరిచింది. ఇప్పుడు అజయ్‌కి ఓ హిట్ కావాలి. మైత్రీ మూవీస్ లో అజయ్ భూపతి ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే హీరో ఎవరన్నది ఇంకా దొరకలేదు. అయితే ఈలోగా మరో సినిమాని ప్లాన్ చేశాడట. ఈసారి కార్తికేయతోనే.
అజయ్ భూపతి - కార్తికేయ కలిసి మరో సినిమా చేయబోతున్నారని ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. ఈ సినిమా కూడా ఆర్.ఎక్స్ లో బోల్డ్ కంటెంట్ తో సాగబోతోందని, ఓరకంగా ప్రయోగాత్మక చిత్రమని తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని రూపొందించే అవకాశాలు ఉన్నాయి. ఆర్.ఎక్స్ 100కి కార్తికేయనేనిర్మాత. ఈసారి కూడా తనే ప్రొడక్షన్ కూడా చేయొచ్చు. ఈ సినిమా అయ్యాకే మైత్రీ లో సినిమా చేస్తాడట అజయ్. హిట్టు కొట్టి, నిరూపించుకుని, మళ్లీ ఓ పెద్ద హీరోని పట్టాలన్నది అజయ్ ప్లాన్ కావొచ్చు. త్వరలోనే ఈసినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తాయి.