అక్కినేని హీరో సుమంత్ హీరోగా కొత్త సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది, సెట్స్ మీదికెళ్లడమే కాదు, నిర్మాణం కూడా పూర్తి చేసేసుకుంది. సినిమా పేరు 'మళ్ళీ రావా'. టైటిల్ క్లాసిక్‌గా ఉంది కదా. బాలీవుడ్ భామ ఆకాంక్ష సింగ్ ఈ సినిమాలో సుమంత్ సరసన హీరోయిన్గా నటిస్తోంది. పలు హిందీ సీరియల్స్‌లోనూ ఆకాంక్ష నటించింది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్‌ని పెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో కంప్లీట్ చేయడంతో, షూటింగ్‌ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయగలిగామని చిత్ర దర్శక నిర్మాతలు చెప్పారు. ఇంత తొందరగా సినిమా కంప్లీట్ కావడంలో సుమంత్ చాలా సహకారం అందించాడంటూ చిత్ర యూనిట్ సుమంత్‌ని పొగిడేస్తోంది. ఇదొక డిఫరెంట్ మూవీ అనీ, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరిస్తుందని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి చెబుతున్నారు. హీరోగా సుమంత్ చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత 'నరుడా డోనరుడా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్ రీమేక్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఆ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా కానీ సుమంత్, రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కాకుండా, డిఫరెంట్ జోనర్ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపడం విశేషం. మళ్లీ ఈ కొత్త రకం కాన్సెప్ట్‌తో వస్తోన్న సినిమాతో సుమంత్ ఆడియన్స్‌ని ఎలా ఎట్రాక్ట్ చేస్తాడో చూడాలిక.