ఎన్టీఆర్‌ కోసం సుమంత్‌.. ఏఎన్నార్‌లా.!

మరిన్ని వార్తలు

అక్కినేని నాగేశ్వరరావులా చాలామంది 'డూప్‌' కట్టారు, కడుతూనే వున్నారు. ఆయనదో విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌. ఆయన్ని అనుకరించడాన్ని చాలామంది ఓ గౌరవంగా భావిస్తారు కూడా. అక్కినేని డైలాగ్స్‌, అక్కినేని డాన్సులు, అక్కినేని ఫైట్స్‌.. ఇలా ఒకటేమిటి, అన్నీ ప్రత్యేకమే. 

అక్కినేని జయంతి నేడు. జీవితాన్ని ఎలా ఆనందంగా గడపాలో చాటి చెప్పిన మహా మనీషి అక్కినేని నాగేశ్వరరావు. ఆయన్ని స్మరించుకుంటూ, ఆయన పాత్రలో సుమంత్‌ గెటప్‌ని రివీల్‌ చేసింది 'ఎన్టీఆర్' బయోపిక్‌ టీమ్‌. క్రిష్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో స్వర్గీయ నందమూరి తారకరామారావు 'బయోపిక్‌' తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఏఎన్నార్‌ పాత్రలో సుమంత్‌ నటిస్తున్నాడు. 

తాతయ్య గెటప్‌లో కన్పించనుండడం ఏ మనవడికైనా అదృష్టమే కదా. అందునా, అక్కినేని నాగేశ్వరరావుకి అత్యంత ప్రీతిపాత్రుడైన మనవడు సుమంత్‌ అక్కినేని. చిన్నప్పటినుంచీ తాతయ్య దగ్గరే పెరిగిన సుమంత్‌, తన తాతయ్య ఏఎన్నార్‌ మరణాన్ని జీర్ణించుకోలేక, చాలాకాలం ఆ జ్ఞాపకాల్లోనే వుండిపోయాడు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. సుమంత్‌ మాటల్లో చెప్పాలంటే, ఏఎన్నార్‌ పాత్రలో నటించడం లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌. అదీ నిజమే. ఎంతమందికి ఆ అదృష్టం లభిస్తుంది.? సుమంత్‌ డిడ్‌ ఇట్‌ ఫర్‌ 'ఎన్‌టిఆర్‌' బయోపిక్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS