నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది.
అందుతున్న వివరాల ప్రకారం, మోహన్ బాబు గారి మాతృమూర్తి లక్ష్మమ్మ (85) గారు ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్నీ మోహన్ బాబు రెండవ కుమారుడు హీరో మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. అయితే ఈ సమయంలో తమ కుటుంబం మొత్తం విదేశాలలో ఉన్నట్టుగా తెలిపాడు.
ఈ విషాద వార్త తెలియగానే ఇండస్ట్రీ ప్రముఖులంతా మోహన్ బాబు గారి తల్లిగారికి సంతాపం తెలియచేస్తున్నారు. లక్ష్మమ్మ గారి అంత్యక్రియలు తిరుపతిలో జరుగుతాయి అని తెలుస్తుంది.