సుమంత్ కథానాయకుడిగా నటించిన చిత్రం. 'మళ్ళీ మొదలైంది'. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. ఇప్పుడు ఓటీటీకి వెళ్లిపోయింది. జీ 5 సంస్థ `మళ్లీ మొదలైంది` ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసతున్నారు.
విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే కథాంశంతో రూపొందిన సినిమా 'మళ్ళీ మొదలైంది'. ఇందులో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో ముఖ్య కథానాయికగా నైనా గంగూలీ నటించారు. ఈ సినిమాకి దాదాపు 2.5 కోట్ల ఖర్చు అయినట్టు సమాచాంర. ఆ మొత్తం ఓటీటీ రూపంలో వచ్చేయడంతో... ఈ సినిమాని ఓటీటీకి ఇచ్చేశారు.