సుమంత్‌ హీరోనా.? విలనా.?

By iQlikMovies - December 27, 2018 - 15:10 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని మేనల్లుడు సుమంత్‌ 'ప్రేమకథ'తో హీరోగా తెరంగేట్రం చేశాడు. ఓ మోస్తరు హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అంతగా సక్సెస్‌ కాలేదు. దాంతో ఒకానొక టైంలో తెరకు దూరమై టెక్నికల్‌ విభాగం వైపు వెళదామని డిసైడ్‌ అయిపోయాడు. ఆ తరుణంలో 'మళ్లీరావా' చిత్రంతో లాస్ట్‌ ట్రైల్‌ వేశాడు. సక్సెస్‌ అందుకున్నాడు. ఆ జోరులో రెండు సినిమాలను ఒప్పుకున్నాడు. 

 

ఇటీవలే 'సుబ్రహ్మణ్యపురం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఓకే అనిపించుకున్నాడు. తాజాగా 'ఇదం జగత్‌' సినిమాతో రానున్నాడు. ఈ నెల 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ చెప్పాడు సుమంత్‌. ఈ సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందట. హీరోనా.? విలనా.? అనే సందిగ్ధంలో ఆడియన్స్‌ పడిపోతారట. 

 

అంత కొత్తగా ఆ క్యారెక్టర్‌ని డిజైన్‌ చేశారట. సుమంత్‌ రిపోర్టర్‌గా నటిస్తున్న ఈ సినిమా ఓ డార్క్‌ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఇదో కొత్త కాన్సెప్ట్‌ అట. టెక్నికల్‌గా ఆడియన్స్‌ని ఉత్కంఠ రేకెత్తించేలా ఉంటుందట ఈ సినిమా కథా, కథనం. ఇంతవరకూ విడుదలైన ప్రోమోస్‌ ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తున్నాయి. చూడాలి మరి ఈ థ్రిల్లర్‌ మూవీ సుమంత్‌కి ఎంత మేర సక్సెస్‌నిస్తుందో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS