'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధార్థ్. 'బొమ్మరిల్లు' తదితర సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి సిద్ధార్థ్ ఖాతాలో. అయితే ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. మొన్నామధ్య 'గృహం' సినిమాతో వచ్చి అందర్నీ భయపెట్టేశాడు. తాజాగా సిద్ధార్థ్ హీరోగా ఓ సినిమా రూపొందడానికి సిద్ధంగా ఉంది.
అయితే ఆ సినిమాలో నటించాలా.? వద్దా.? అనే నిర్ణయాన్ని ఫ్యాన్స్ అనుమతితో తీసుకోవాలని సిద్ధార్థ్ డిసైడ్ అయ్యాడు. రీసెంట్గా బాలీవుడ్లో ఘన విజయం సాధించిన 'ఆంథాధూన్' అనే మూవీని సౌత్‌లో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా సిద్ధార్థ్ అయితే బాగుంటుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. సిద్ధార్థ్ వద్ద ఆ ప్రపోజల్ తీసుకొచ్చారట. అయితే సిద్ధార్థ్ మాత్రం ఫ్యాన్స్‌కి అప్పీల్ పెట్టాడు.
'నన్ను ఈ సినిమాలో చూసేందుకు ఎంతమంది ఇష్టపడుతున్నారు.? ప్లీజ్ సీరియస్‌గా అడుగుతున్నాను చెప్పండి..' అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. చాలా మంది ఫ్యాన్స్ యస్ అన్నారు. ఈ సినిమాలో హీరోగా నటించిన ఆయుష్మాన్ ఖురానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దాంతో సిద్ధార్థ్‌కి లైన్ క్లియర్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో సిద్ధార్థ్ నటిస్తాడా.? లేదా.? అనేది చూడాలిక.