ఏ 1 ఎక్స్‌ప్రెస్ తో ఈ యేడాది ప్రేక్షకుల్ని పలకరించాడు సందీప్ కిషన్. ఆ సినిమా ఓకే అనిపించింది. వసూళ్లు బాగానే వచ్చాయి. ఇప్పుడు `గల్లీ రౌడీ` పేరుతో ఓ సినిమా చేశాడు. త్వరలో ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకే ప్రచార పర్వానికి తెర లేపారు. ఈరోజు... విజయ్ దేవరకొండ చేతుల మీదుగా టీజర్ విడుదల కానుంది.
అయితే.. ఈ సినిమా ఓ తమిళ చిత్రానికి కాపీ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి నటించిన `నానుమ్ రౌడీ దాన్` సినిమాలోని ఓ పాయింట్ ని పట్టుకుని `గల్లీ రౌడీ`గా తీశార్ట. అయితే `నానుమ్ రౌడీ దాన్` తెలుగులో డబ్ అయ్యింది. `నేనూ రౌడీనే` పేరుతో విడుదలైంది. ఆపాయింట్ చాలామందికి తెలుసు. మరి... దాన్ని తెలుగులోకి ఎలా మార్చారన్నది ఆసక్తి కరం. కోన వెంకట్ ఈ చిత్రానికి నిర్మాత. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించారు.