జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతో ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తున్నారు సందీప్ కిషన్. తాజాగా ‘మైఖేల్’తో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి భారీ తారాగణాన్ని ఎంచుకొని పక్కాగా రంగంలోకి దిగాడు. టీజర్లు, ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
అయితే సినిమాకి మాత్రం తొలి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్ లో కనిపించిన మ్యాజిక్ సినిమాలో కొరవడింది. చాలా మంది విమర్శకులు సినిమాపై పెదవి విరిచారు. కేజీఎఫ్ స్టయిల్ ని ఫాలో అయ్యి బోర్లా పడ్డారని విమర్శించారు. అయితే సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావడం వలన తొలి రోజు 4.6 కోట్ల గ్రాస్ చేసింది. బహుసా సందీప్ కిషన్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి. పాన్ ఇండియా రిలీజ్, స్టార్ కాస్టింగ్, ట్రైలర్ ఇవన్నీ ఓపెనింగ్ కి కలిసొచ్చాయని చెప్పొచ్చు.