పోలీస్ అంటే రక్షకభటుడు అంటారు. కాని అలాంటి రక్షకభటులు దగ్గరకి వెళ్ళాలంటే ఏదో తెలియని భయం తెలియకుండా వాళ్ళంటే భక్షకభటులు అనే అభిప్రాయం సామాన్యల బ్రెయిన్ లో ముద్రయిపోయింది. అన్ని చిత్రాల్లో పోలీస్ పాత్రల్ని అవినీతిపరులుగా చిత్రీకరిస్తూనే వచ్చారు. కాని ఒక్క కృష్ణవంశి చిత్రంలో మాత్రమే తన అభిప్రాయం కాకుండా సోసైటి అభిప్రాయాన్ని తెరకెక్కిస్తాడు. ఇప్పటికి ఖడ్గం అనే చిత్రంలో శ్రీకాంత్ చేసిన పోలీస్ ఆఫిసర్ పాత్ర కాని, సముద్రం చిత్రంలో శ్రీహరి చేసిన పోలీస్ పాత్రకాని, సింధూరం చిత్రంలో బ్రహ్మజి చేసిన పోలీస్ పాత్ర కాని ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయి. మళ్ళి అలాంటి ఇంటెన్సిటివ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఇప్పటికి రాలేదనే చెప్పాలి. అయితే ఇక్కడోక సీన్ గురించి చెప్పాలి.. చిన్నప్పటి నుండి ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ఓ కుర్రాడు తను ప్రేమించిన అమ్మాయిని సైకిల్ మీద ఎక్కించుకుని వెలుతున్నాడు. చుట్టు పక్కల చాలా లగ్జరీస్ ఇల్లు వున్నాయి. అవన్ని చూస్తూ ఆ అమ్మాయి నువ్వు ఎస్.ఐ అయ్యాక మనం ఇలాంటి ఇళ్ళు కొనాలి. ఇలాంటి కారు కొనాలి. మన పిల్లల్ని ఇంత పెద్ద స్కూల్స్ లో జాయిన్ చెయ్యాలి అని చెబుతుంటుంది. వెంటనే ఆ కుర్రాడు సైకిల్ ఆపి ఆ అమ్మాయిని కిందకి దింపి అసలు ఓక ఎస్ ఐ నెల జీతం నీకు తెలుసా.. అన్ని కటింగ్స్ పోయి 28,900 వస్తాయి.. అలా వచ్చిన జీతంలో నువ్వు ఎలా కావాలంటే అలానే బ్రతుకు అని చెబుతాడు.. ఇది పోలీస్ అంటే తను బ్రతుకుతూ పది మందికి తన రక్షణతో బ్రతుకునిచ్చేవాడు.. ఇలాంటి ఎమెషన్ డైలాగ్స్ నక్షత్రం చిత్రంలో దర్శకుడు కృష్ణవంశి సందీప్ కిషన్ తో చెప్పించారు. అంతే కాదు దాన్ని మించిన ఎమెషన్ తో సీన్ ని తెరకెక్కించాడు. ఇలాంటి సీన్లు దాదాపు చిత్రంలో 10 వరకూ వుంటాయని సెన్సారు సభ్యులు చెబుతున్న మాట.. అలాగే హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో తన నటన అత్యద్బుతంగా చేశాడని, చూసిన ప్రతి పోలీస్ ఆఫీసర్ గర్వంగా ఫీలవుతాడని ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ చిత్రం అగష్టు 4న విడుదల కానుంది.