హాస్య నటుడు సత్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా... `వివాహ భోజనంబు`. దీనికి సందీప్ కిషన్ నిర్మాత. ఈ శుక్రవారమే ఓటీటీలో విడుదలైంది. టాక్ అంతంత మాత్రమే. అయితే నిర్మాతగా.. సందీప్ సేఫ్ అయిపోయాడని టాక్. ఈసినిమాని కేవలం కోటి రూపాయల బడ్జెట్ లో ముగించారని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో సాగే కథ ఇది. లొకేషన్లు తక్కువ. స్టార్ కాస్టింగ్ కూడా పెద్దగా లేదు. తక్కువ రోజుల్లో పూర్త చేశారు. అందుకే రూ. కోటి లో సినిమా ముగిసింది.
అయితే మార్కెట్ మాత్రం బాగానే చేసుకున్నాడు. ఓటీటీ రూపంలో 1.5 కోట్ల వరకూ వచ్చాయట. అది కాకుండా శాటిలైట్ రైట్స్ కూడా ఉన్నాయి. ఎలా చూసినా ఈ సినిమా ద్వారా కనీసం 1.5 కోట్లు సంపాదించొచ్చు. అందుకే సందీప్ ఇప్పుడు ఇలాంటి చిన్నబడ్జెట్ సినిమాల్ని తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఈ యేడాది మరో రెండు చిన్న సినిమాల్ని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు.