సందీప్ కిషన్ స్పీడు పెంచాడు. ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే మరో సినిమాని లైన్‌లో పెట్టేశాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త సినిమాకి 'కేరాఫ్ సూర్య' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. తమిళ హీరో సూర్య ఈ టైటిల్‌ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' ఫేం మెహరీన్ ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ హీరో కార్తితో 'నా పేరు శివ' సినిమా తెరకెక్కించిన సుసీంద్రన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకీ 'కేరాఫ్ సూర్య' అంటే ఏంటి? అది సినిమా చూస్తేనే తెలుస్తుందట. ఇందులో హీరో సూర్యకి సంబంధించి ఓ ఇంపార్టెంట్ అంశం ఉంటుందట. అందుకే సినిమా టైటిల్ అలా పెట్టారనే టాక్ తమిళ సినీ వర్గాల్లో వినవస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందుతోంది ఈ సినిమా. సందీప్ కిషన్‌కి టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ ఉంది. అయితే ఈ సినిమాలో తమిళ హీరో సూర్య గురించి మేటర్ ఉందన్న ఇష్యూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ ఇంట్రెస్టింట్ మేటర్‌ని లీక్ చేయడంతో తెలుగులోనే కాదు, తమిళంలో కూడా ఈ సినిమాపై ఆశక్తి పెరుగుతోంది. మరో పక్క సందీప్ కిషన్ హీరోగా 'నక్షత్రం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. రెజీనా సందీప్ కిషన్‌కి జోడీగా నటిస్తోంది.