ఆ మూడూ క‌లిస్తే... త్రివిక్ర‌మ్‌ శ్రీనివాస్ : సునీల్

By iQlikMovies - October 03, 2018 - 15:24 PM IST

మరిన్ని వార్తలు

త్రివిక్ర‌మ్ - సునీల్ మ‌ధ్య ఫ్రెండ్ షిప్ గురించి చెప్పేదేముంది??  భీమ‌వ‌రం నుంచి ఎర్ర‌బ‌స్సెక్కి.. హైద‌రాబాద్ వ‌చ్చి, ఇక్క‌డ అవ‌కాశాల కోసం ప‌గ‌టి క‌ల‌లు కంటున్న‌ప్ప‌టి నుంచీ వాళ్లిద్ద‌రూ జాన్ జిగుర్ దోస్తులు. 

త్రివిక్ర‌మ్ గురించి సునీల్‌.. సునీల్ గురించి త్రివిక్ర‌మ్ చెబుతూనే ఉంటారు. వాళ్ల బంధం ఇప్ప‌టికీ చాలా  స్ట్రాంగ్ గా కొన‌సాగుతోంది.  అటు హీరోగా అవ‌కాశాలు లేక‌, వ‌చ్చిన సినిమాలు హిట్ అవ్వ‌క డీలా ప‌డిన సునీల్ కెరీర్‌కి 'అర‌వింద స‌మేత‌'తో మ‌రోసారి ఓ మ‌లుపు ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు త్రివిక్ర‌మ్‌.  

అందుకే 'ఎన్ని వేషాలేసినా... చివ‌రికి నాకంటూ ఓ మంచి పాత్ర రాయ‌డానికి త్రివిక్ర‌మ్ ఎప్పుడూ ఉంటాడు. అదే నా భ‌రోసా' అంటూ `అర‌వింద స‌మేత` ఆడియో వేడుక‌పై త్రివిక్ర‌మ్‌తో త‌న‌కున్న అభిమానాన్ని చాటుకున్నాడు సునీల్‌.  త‌న స్నేహితుడి గురించి మాట్లాడుతున్న‌ప్పుడు స్వ‌యంగా త్రివిక్ర‌మే పూనాడేమో.. ఓ మంచి డైలాగ్ కూడా చెప్పాడు.

''చిన్న‌ప్పుడు అమ్మానాన్న‌లు మ‌న‌ల్ని ప్రేమ‌గా పెంచుతారు. గురువులు జ్ఞానం అందిస్తారు. సోద‌రులు కావ‌ల్సిన‌ప్పుడ‌ల్లా డ‌బ్బులిచ్చి బాగా చూసుకుంటారు. హైద‌రాబాద్ వ‌చ్చాక‌... ఆ మూడు పాత్ర‌లూ పోషించిన వ్య‌క్తి త్రివిక్ర‌మ్‌. నా ఎదుగుద‌ల చూసి స్నేహితుడిగా త‌ను ఇంకా ఆనందిస్తుంటాడు'' అంటూ... వాళ్ల మ‌ధ్య అనుబంధాన్ని చెప్పుకొచ్చాడు సునీల్‌. 

అర‌వింద స‌మేత‌లో త‌ను పూర్తి స్థాయి పాత్ర పోషించాడు. ఈ సినిమా అంత‌టా సునీల్ క‌నిపిస్తాడు. మ‌రి ఈ పాత్ర సునీల్‌కి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS