త్రివిక్రమ్ సినిమాల్లో సునీల్‌కి మంచి పాత్రలు పడ్డాయి. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, అతడు.. ఇలా ఏ సినిమా చూసుకున్నా సునీల్ పాత్ర భలే బాగా పండింది. కమెడియన్‌గా ఎదగడానికి సునీల్‌కి త్రివిక్రమ్ పాత్రలే ఆలంబనగా నిలిచాయి.
ఇప్పుడు చాలా కాలం తరవాత త్రివిక్రమ్ సునీల్ కోసం ఓ పాత్ర రాశాడు. అదే నీలాంబరి. `అరవింద సమేత వీర రాఘవ`లో సునీల్ నీలాంబరిగా నటించిన సంగతి తెలిసిందే. మరి ఈ పాత్ర ఎలా ఉండబోతోంది? తెరపై ఏం చేస్తుంటుంది? వీటిపై ఓ క్లూ దొరికింది.
సునీల్ ఇందులో ఓ గ్యారేజ్ నడుపుతూ ఉంటాడట. ఓ సారి ఎన్టీఆర్ ఇచ్చిన సలహా వల్ల... నీలాంబరికి మంచి లాభాలొస్తాయట. అందుకే `నువ్వు ఇక్కడే ఉండిపో భయ్యా` అనేసరికి ఎన్టీఆర్ సునీల్‌తో పాటు ఉండిపోతాడట. అలా నీలాంబరికీ వీర రాఘవకీ మధ్య స్నేహం మొదలవుతుందని, అది చివరి వరకూ కొనసాగుతుందని తెలుస్తోంది.
సునీల్ పాత్ర నవ్వించడమే కాదు, చివర్లో కంటతడి కూడా పెట్టిస్తుందని, త్రివిక్రమ్ రాసిన పాత్రల్లో నీలాంబరి కూడా గుర్తుండిపోయే పాత్ర అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాతో సునీల్‌కి మళ్లీ బ్రేక్ వచ్చినట్టే.