సునీల్ స్టార్ మల్టీ ట్యాలెంటడ్. కమెడియన్ గా వచ్చాడు. హీరో అయ్యాడు. విలన్ పాత్రలో అదరగొట్టాడు. పుష్పలో మంగళం శ్రీను పాత్ర సునీల్ ని కొత్తగా ఆవిష్కరించింది. కామెడీనే కాదు.. టెర్రిఫిక్ విలనిజం కూడా చేయగలడని నిరూపించింది. అంతేకాదు..ఈ పాత్రతో బాలీవుడ్ ద్రుష్టిని కూడా ఆకర్షించాడు సునీల్. పుష్ప తర్వాత సునీల్ కోసం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మూడు ఆఫర్లు వచ్చాయి. అందులో రెండు ఆఫర్లని ఓకే చేశాడు.
ఈ విషయాన్ని స్వయంగా సునీల్ దృవీకరించాడు. బాలీవుడ్ కాకుండా తమిళ్, కన్నడ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయట. ఇందులో కొన్ని కామెడీ రోల్స్ కూడా వున్నాయని చెప్పుకొచ్చాడు సునీల్. హీరోగా వరుస పరాజయాల తర్వాత సునీల్ కెరీర్ కాస్త గందరగోళంలో పడింది. మళ్ళీ క్యారెక్టర్ రోల్స్ చేసిన సునీల్ బ్రేక్ కోసం చూశాడు. ఈ క్రమంలో వచ్చిన మంగళం శ్రీను పాత్ర సునీల్ కెరీర్ కి కొత్త మలపు తీసుకొచ్చిందని చెప్పుకోవాలి.