పోర్న్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ సన్నీలియోన్ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాగే తెలుగులో కూడా ఈ ముద్దుగుమ్మ ఒకటీ అరా చిత్రాల్లో కనిపించింది. ముఖ్యంగా మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన 'కరెంట్ తీగ' సినిమాలో ఈ అమ్మడు ఓ ఐటెం సాంగ్‌లో నటించింది. అలాగే కొన్ని సీన్స్‌లో కూడా తళుక్కుమని మెరిసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షారూఖ్ ఖాన్ హీరోగా వచ్చిన 'రాయీస్' సినిమాలో 'లైలా ఓ లైలా' అన పాటలో స్టెప్పులేసింది. సినిమా ఆశించినంత విజయం అందుకోకపోయినా కానీ, ఈ పాట మాత్రం దుమ్ము రేపేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే ఈ పాటతో సన్నీ, షారూఖ్ మెప్పు కూడా పొందింది. ఇంతవరకూ చేసిన సినిమాల్లోకెల్లా ఈ సినిమాలోని ఈ ఐటెం సాంగ్ తనకెంతో స్పెషల్ అని చెప్పుకొచ్చింది సన్నీలియోన్. అలాగే ఇకపై, వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోననీ కూడా అంటోంది. అవకాశాలు అనేవి మనం కావాలనుకున్నప్పుడు రావనీ, అవి వచ్చినప్పుడే అంది పుచ్చుకోవాలనీ స్వీట్‌గా సలహా కూడా ఇచ్చేస్తోంది. ఎందుకటే మొదట్లో ఈ అమ్మడు కొన్ని పాత్రలకే పరిమితం కావాలని అనుకుంది. అన్ని రకాల పాత్రలనీ టేకప్ చేయలేదు. అలా ఈ ముద్దుగుమ్మ కొన్ని మంచి పాత్రలు కూడా వదులుకుందట. తాజాగా 'రాయీస్' ఇచ్చిన ఊపుతో అమ్మడు మనసు మార్చుకుని ఏ అవకాశం వచ్చినా, భాషతో సంబంధం లేకుండా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటోంది. శభాష్ సన్నీలియోని.