సీక్రెట్‌ ఆఫ్‌ సన్నీలియోన్‌ ఇది నిజమేనా.?

మరిన్ని వార్తలు

సన్నీలియోన్‌ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనేముంది.? అడల్ట్‌ సినిమాల్లో సంచలనం సృష్టించి బాలీవుడ్‌ తెరపై హీరోయిన్‌గా సంచలన విజయాల్ని అందుకున్న సన్నీలియోన్‌ ఇప్పటికే తన జీవిత కథను వెబ్‌సిరీస్‌గా తీసుకొచ్చేసింది. కానీ తానేంటో తన బయోపిక్‌ ద్వారా నిరూపించుకోవాలన్న కోరిక మాత్రం సన్నీలియోన్‌లో అలాగే ఉండిపోయింది. 

కథ సిద్ధంగానే ఉంది. అడిగితే దర్శకులెవరూ కాదనరు. తానే పెట్టుబడి పెట్టగలదు కనుక నిర్మాణం కూడా పెద్ద కష్టం కాదు. కానీ వెండితెరపైకి సన్నీలియోన్‌ బయోపిక్‌ ఇప్పట్లో రావడం కష్టమేనేమో. అయితే సన్నీలియోన్‌ మాత్రం ఎలాగైనా ఆ బయోపిక్‌ని సినిమాగా మార్చాలని కసితో ఉందట. భర్త వెబర్‌తో కలిసి మరికొంత అత్యంత సన్నిహితులతో కలిసి తన బయోపిక్‌ గురించి సమాలోచనలు చేస్తోందట.

 

సన్నీలియోన్‌ అంటే హిందీ సినిమాలకే పరిమితం కాదు, తెలుగులో రెండు సినిమాలు చేసింది. తమిళంలో ఓ సినిమా చేయబోతోంది. ఇండియా అంతా సన్నీలియోన్‌కి పాపులారిటీ ఉంది. ముహూర్తం కుదిరితే ఏ క్షణాన్నైనా తన బయోపిక్‌ని సెట్స్‌ మీదికి తీసుకెళ్లొచ్చు. అయితే అది ఎప్పుడనేది చెప్పడం కష్టం. 

విదేశాల్లో పుట్టి, పెరిగిన తను ఏ పరిస్థితుల ప్రభావంతో అడల్ట్‌ సినిమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది.. ఆ తర్వాత ఆ రంగాన్ని వదిలి మెయిన్‌ స్క్రీన్‌ సినిమాలపై దృష్టి పెట్టింది.. బాలీవుడ్‌లో తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నది.. కుమార్తైను దత్తత తీసుకునే క్రమంలో ఎదుర్కొన్న సమస్యలు ఇవన్నీ సన్నీలియోన్‌ బయోపిక్‌లో ఉంటాయట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS