బిగ్ బాస్ రియాలిటీ షో తో ఒక్కసారిగా అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకున్న నటుడు కౌశల్. ఆయన బిగ్ బాస్ ఇంటిలో గేమ్ ఆడిన విధానం, తద్వారా ఆయనకి బయట వచ్చిన సపోర్ట్ తో బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేతగా నిలిచాడు.
అయితే ఆ గెలుపు తరువాత ఆయన అభిమానులమంటూ కౌశల్ ఆర్మీ పేరిట సోషల్ మీడియా లో వేరే సభ్యులని తిట్టడం వంటివి చేస్తుండడంతో వారి పట్ల సమాజంలో కాస్త వ్యతిరేకత ఎదురైంది. ఇంతలోనే కౌశల్ తన గెలుపుకి శుభాకాంక్షలు తెలపడానికి PMO ఆఫీస్ నుండి ఫోన్ వచ్చిందని, ఆ తరువాత ఒక ప్రఖ్యాత యునివర్సిటీ కౌశల్ కి త్వరలోనే డాక్టరేట్ ఇవ్వనుంది అని వార్తలు వచ్చాయి.
దీనిని కౌశల్ కూడా దృవీకరించడం జరిగింది. ఈ సమయంలోనే సదరు డాక్టరేట్ వార్త తప్పు అని తేలిపోయింది. నిన్న ఇదే అంశం పైన ఒక టెలివిజన్ డిబేట్ లో ఆయనకి డాక్టరేట్ వస్తుంది అని హామీ ఇచ్చిన వ్యక్తి తప్పు చెప్పాడు అని తేలడం, సదరు యునివర్సిటీ ప్రతినిధి కూడా ఇదే తప్పు అని రాతపూర్వకంగా వివరణ ఇవ్వడంతో ఈ డాక్టరేట్ పైన ఒక క్లారిటీ వచ్చింది.
అదే సమయంలో PMO నుండి కాల్ చేశాను అన్న వ్యక్తి కూడా ‘ఫేక్’ అని తేలింది. దీనితో కౌశల్ ఒక్కసారిగా అవాక్కవ్వకతప్పని పరిస్థితి నెలకొంది. చివరగా ఫేం వచ్చిన వారి చుట్టూ ఇలా తప్పుదోవ పట్టించే వారు ఉంటుంటారు వారితో తెలివిగా మెలగడం మంచిది అన్న అభిప్రాయానికి కౌశల్ వచ్చి ఉంటాడు అని ఆయన అభిమానులు అనుకుంటున్నారు.