చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప!

By iQlikMovies - August 22, 2018 - 17:32 PM IST

మరిన్ని వార్తలు

హాట్‌ అండ్‌ బోల్డ్‌ సన్నీలియోన్‌ పొట్టి గౌనులో కిర్రాకు పుట్టించేస్తోంది కదూ! ఎందుకో ఈ మధ్య ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో అవకాశాలు కాస్త తగ్గినట్లే కన్పిస్తోంది. అయితే, తనంతట తానుగా తీసుకున్న చిన్న 'గ్యాప్‌' తప్ప, అది అవకాశాల్లేకపోవడంతో వచ్చిన గ్యాప్‌ కాదంటూ సన్నీలియోన్‌ చెబుతోంది. తెలుగులో 'కరెంట్‌ తీగ', 'పిఎస్‌వి గరుడవేగ' సినిమాల్లో కన్పించి వెండితెరను హీటెక్కించేసింది ఈ ఒకప్పటి పోర్న్‌ స్టార్‌. తన జీవిత చరిత్ర సినిమాగా తెరకెక్కడం, అందులో తానూ ఓ భాగం కావడం చాలా ఆనందంగా వుందంటోన్న సన్నీలియోన్‌, త్వరలో ఓ సినిమాని కూడా తన జీవిత చరిత్ర నేపథ్యంలో రూపొందించే అవకాశాల్ని కొట్టిపారేయడంలేదు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా వుంటూ అభిమానులతో ఇంటరాక్ట్‌ అవడమే కాదు, తన పేరునే బ్రాండ్‌గా మార్చేసుకుని సౌందర్య సాధనాల్ని విక్రయిస్తూ, పండగ చేసేసుకుంటోంది. తెలివి అంటే సన్నీలియోన్‌లా వుండాలి మరి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS