సన్నీలియోన్‌లో ఈ కోణం మీకు తెలుసా?

By iQlikMovies - July 06, 2018 - 14:45 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'కరణ్‌జీత్‌ కౌర్‌'. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. అయితే ఇది సినిమా కాదు, వెబ్‌ సిరీస్‌గా రూపొందించాలని యూనిట్‌ భావిస్తోంది. 

ప్రస్తుతం విడుదలైన ట్రైలర్‌ విషయానికి వస్తే, సన్నీలియోన్‌ చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, మోడలింగ్‌లోకి సన్నీ ఎంట్రీ తదితర అంశాలను ప్రస్థావించినట్లుగా కనిపిస్తోంది. సన్నీకి మేకప్‌ వేస్తున్న సీన్స్‌తో ట్రైలర్‌ స్టార్ట్‌ అయ్యింది. తర్వాత మోడలింగ్‌లో నిలదొక్కుకోవడానికి చేసిన గ్లామర్‌ షో, హద్దులు దాటిన ఎక్స్‌పోజింగ్‌ తదితర అంశాలు ట్రైలర్‌లో చూచాయగా చూపించారు. సన్నీ మోడలింగ్‌ రంగాన్ని ఎంచుకోవడం నచ్చక, తల్లితండ్రులు ఆమెను మందలించడం కూడా చూపించారు. జూలై 16 నుండి ఈ సిరీస్‌ ఓ ఇంగ్లీష్‌ ఛానెల్‌లో ప్రసారం కానుంది. 

ఇకపోతే సన్నీ పర్సనల్‌ లైఫ్‌ విషయానికి వస్తే, పోర్న్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన సన్నీలియోన్‌, బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసేందుకు చాలా కష్టపడింది. ఎలాగోలా బాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సన్నీలియోన్‌ అక్కడ స్టార్‌గా సెటిలైంది. ఇప్పుడిప్పుడే సౌత్‌ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది. ఐటెం సాంగ్స్‌తో సౌత్‌లో ఎంట్రీ ఇచ్చిన సన్నీలియోన్‌ ఇప్పుడు ఫుల్‌ లెంగ్త్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి స్పీడుగా అడుగులు వేస్తోంది. 

ఆల్రెడీ సన్నీలియోన్‌ హీరోయిన్‌గా సౌత్‌లో 'వీరమహాదేవి' చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS