సన్నీలియోన్‌ని అలా చూస్తేనే చాలు కుర్రోళ్లకు హుషారు. ఇక ఇలా చూస్తే ఇంకెంత జోరు.. చెప్పండి. 'ఇలా' అంటే ఇంకేదో అనేసుకోకండి. పిక్ చూస్తున్నారుగా, బుసలు కొట్టే నాగినిలా కనిపిస్తోంది. చేతులు పైకెత్తి, ఎక్స్‌ప్రెసివ్ కళ్లతో కొంచెం సీరియస్‌గా కనిపిస్తున్నా, క్యూట్‌గా ఎట్రాక్ట్ చేస్తోంది. నాగుపాము కుబుసంలాంటి ప్యాటర్న్ అనాలా.? లిపర్డ్ ప్రింటెడ్ డ్రస్ అనాలో కానీ, సన్నీ ధరించిన ఈ కాస్ట్యూమ్ ఆమె అందాలను రెట్టింపు చేస్తోంది. చెవులకు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్, పోనీ టెయిల్, ఫేస్‌లో లైట్ మేకప్‌తో, సెక్సీ లుక్స్‌తో చితక్కొట్టేస్తోంది.
రీసెంట్గా దిగిన ఈ ఫోటోని సన్నీ పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో వ్యూస్ క్యూ కట్టేశాయ. ఇదిలా ఉంటే, బాలీవుడ్లో గ్లామర్ తారగా ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్ ప్రస్తుతం సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది. సౌత్‌లో పూర్తి స్థాయి హీరోయిన్గా రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'వీర మహాదేవి'. దాదాపు సౌత్ భాషలన్నింట్లోనూ ఈ సినిమా విడుదలవుతోంది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలీదు కానీ, ఈ సినిమాతో సన్నీలియోన్ సౌత్ కెరీర్‌పై ఓ ఐడియా అయితే రానుంది. గతంలో 'గరుడవేగ' చిత్రంలో సన్నీలియోన్ స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. 'డియ్యోడియ్యో..' అనే ఆ సాంగ్ బాగా క్లిక్ అయ్యింది.