'ముక్కు మీద కోపం ముఖానికే అందం అంటుంటారు..' కానీ, కొందరి కోపాన్ని తట్టుకోవడం కష్టమే సుమీ. అందులోనూ ముట్టుకుంటే కందిపోయే ముద్దుగుమ్మల కోపమైతే, కాస్త తాపాన్ని కలిగించే అంశమే. అసలు వివరాల్లోకి వెళితే, తాప్సీ పన్నుకి కోపమొచ్చిందండీ. ఎందుకంటారా. ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతోన్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో గ్లామర్ డాళ్‌గా వాడేసుకున్నారనీ, ప్రాధాన్యత ఉన్న పాత్రలు అస్సలు ఇవ్వలేదనీ, ఇదిగో నటి అంటే ఇది, ఇండస్ట్రీ అంటే ఇదే.. అని తెగ డప్పులు కొట్టేసుకున్న తాప్సీ పన్ను ఎలాగైతేనేం, బాలీవుడ్‌లో హవా గట్టిగానే చూపిస్తుందిలెండి. తాజాగా 'చాంద్‌కీ ఆంఖ్' సినిమాలో తాప్సీ నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదో ప్రయోగాత్మక చిత్రం. తాప్సీతో పాటు భూమి ఫడ్నేకర్ కూడా నటిస్తోంది ఈ సినిమాలో. ఈ ఇద్దరు ముద్దుగుమ్మలూ 60 ఏళ్ల వృద్ధురాలి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ ఎప్పుడో రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌కి రెస్పాన్స్ బాగానే వచ్చింది. కానీ రెస్పాన్స్‌లో కొంత పోజిటివిటీ, కొంత నెగిటివిటీ తప్పదు కదా.. అయితే ఆ రెస్పాన్స్‌పై తాప్సీకి ఇప్పుడు కోపమొచ్చిందట విచిత్రంగా.
రియలిస్టిక్ స్టోరీని బేస్ చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో తమ పాత్రల గురించి అనవసరంగా హేళన చేయడం సరికాదు, అయినా 30 ఏళ్ల వారు కాలేజీ స్టూడెంట్స్‌గానూ, 60 ఏళ్ల వాళ్లు చిన్నపిల్లలగానూ నటిస్తున్న ఈ రోజుల్లో ఇలా నా పాత్రను మాత్రమే తప్పుపట్టడం సబబు కాదు.. అంటూ తాప్సీ గుస్సా అవుతోంది. సెటైర్ అయితే ఎవరికి వేసిందో తెలీదు కానీ, కోపం మాత్రం తాప్సీకి నెటిజన్స్‌పైనే వచ్చిందండీ బాబూ. ఆమె కోపం చల్లార్చాలంటే ఏం చేయాలో.. కోపం తెప్పించిన సదరు నెటిజన్సే యోచించాలి మరి.