సన్నీలియోన్‌ అందుకే అంత స్పెషల్‌

మరిన్ని వార్తలు

ట్రెండింగ్‌లో వున్న అంశాల్ని పట్టుకుని పబ్లిసిటీ స్టంట్లు చేయడంలో ఒకప్పటి అడల్ట్‌ స్టార్‌, ఇప్పటి బాలీవుడ్‌ సెక్సీ స్టార్‌ సన్నీలియోన్‌కి సాటి ఇంకెవరూ రారేమో. అయినాగానీ, ఆమె మంచి పనుల నిమిత్తం పబ్లిసిటీ స్టంట్లు చేస్తుంది గనుక, వాటి వల్ల అందరిలో అవగాహన పెరిగేందుకు ఆస్కారముండడంతో ఆమెను అభినందించాల్సిందే. ప్రపంచాన్ని వణికిస్తోన్న ‘కరోనా వైరస్‌’ తీవ్రత నేపథ్యంలో వీలైనంతవరకు మాస్క్‌లు ధరించి బయటకు వెళ్ళడం మంచిదని వైద్యులు సూచిస్తున్న విషయం విదితమే. ఈ మాస్క్‌ల వినియోగంపై అవగాహన కల్పించేందుకు తన కుటుంబం నుంచే ఆ ప్రక్రియ ప్రారంభించింది సన్నీలియోన్‌.

తన పిల్లలు, తన భర్తతో కలిసి మొహానికి మాస్క్‌లు ధరించిన ఫొటోని సోషల్‌ మీడియాలో సన్నీలియోన్‌ షేర్‌ చేసింది. క్షణాల్లో ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇలా మాస్క్‌లు ధరించాల్సి రావడం బాధాకరమనీ, కానీ ఇదిప్పుడు అత్యవసరమనీ సన్నీలియోన్‌ అభిప్రాయపడింది. సన్నీలియోన్‌కి మొత్తం ముగ్గురు పిల్లలు. ఒక చిన్నారిని ఆమె దత్తత తీసుకోగా, మరో ఇద్దరు కవలలు.. ఇద్దరూ సరోగసీ విధానంలో పుట్టారు. సన్నీలియోన్‌, కెనడానికి చెందిన భారతీయురాలు కాగా, ఆమె భర్త కూడా విదేశాయుడే. అయితే, ఇప్పుడంతా కలిసి ముంబైలోనే సెటిల్‌ అయ్యారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS