అడల్ట్ స్టార్‌గా ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సన్నీలియోన్, ఇప్పుడు బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ప్రస్తుతానికైతే సినిమాలు పెద్దగా చేతిలో లేకపోయినా, సన్నీలియోన్.. అన్న పేరుకున్న డిమాండ్ మాత్రం తగ్గలేదు. ఇదిలా వుంటే, ఎప్పుడూ ఫిట్‌గా వుండే సన్నీలియోన్, కరోనా వైరస్ నేపథ్యంలో సరికొత్తగా వర్కవుట్స్ షురూ చేసింది. దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ 21 రోజులూ స్పెషల్ వర్కవుట్స్ చేయబోతోందట. బరువు తగ్గిపోవాలనే లక్ష్యాలు ఏమీ పెట్టుకోకపోయినా, గతానికి భిన్నంగా ఇప్పుడు సరికొత్త వర్కవుట్స్ చేస్తానంటోంది సన్నీలియోన్.
‘నా ఆరోగ్యంతోపాటు, నన్ను ఫాలో అయ్యే వారి ఆరోగ్యం కోసం కూడా ఇలా చేస్తున్నా.. నన్ను చూసి కొంతమంది ఇన్‌స్పైర్ అయినా చాలు..’ అని చెబుతోన్న ఈ బ్యూటీ, ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీని పెంచుకుంటే కరోనా వైరస్ పట్ల భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదంటోంది. వ్యక్తిగత పరిశుభ్రత చాలా వ్యాధులకు దూరంగా వుండేలా చేస్తుందనీ, కరోనా వైరస్‌కి కూడా వ్యక్తిగత పరిశుభ్రతే అసలు సిసలు నివారిణి అనీ సన్నీలియోన్ అభిప్రాయపడింది. వెండితెరపై అందాల విందు మాత్రమే కాదు, ఆరోగ్యం గురించి అందమైన కబుర్లు కూడా సన్నీలియోన్‌కి బాగానే తెలుసని అంతా అనుకుంటున్నారిప్పుడు.