మిస్టర్‌ సన్నీలియోన్‌ నచ్చేశాడు

మరిన్ని వార్తలు

సన్నీలియోన్‌ అంటే గుర్తుకొచ్చేది హాట్‌నెస్‌ మాత్రమే. తన అందాలతో హాట్‌ హాట్‌ ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ కుర్రోళ్ల గుండెల్ని కొల్లగొట్టే సెక్సీ బ్యూటీ సన్నీలియోన్‌. అయితే ఇప్పుడు సన్నీలియోన్‌ మగాడిగా మారిపోయింది. నమ్ముతారా? నమ్మి తీరాల్సిందే. 

బాలీవుడ్‌లో సన్నీలియోన్‌ నటిస్తున్న 'తేరా ఇన్తిజార్‌' సినిమా కోసం సన్నీలియోన్‌ ఇలా మగాడిగా మారిపోయింది. ఈ సినిమాలో ఓ పాటలో మగాడి గెటప్‌లో కనిపిస్తోంది సన్నీలియోన్‌. ఈ గెటప్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మగాడి గెటప్‌లోనూ సన్నీలియోన్‌ భలేగుందిలే. గెటప్‌ డిజైన్‌ చాలా బాగా చేశారు. ఈ గెటప్‌లో సన్నీలియోన్‌ తనను తాను చూశాక, మా డాడీలాగా, మా సోదరుడిలాగా ఉన్నాననిపిస్తోందని మురిసిపోతోంది. 

ఇంతవరకూ ఇలాంటి గెటప్‌ తాను ఎప్పుడూ ట్రై చేయలేదట. కనీసం సరదాకి కూడా ట్రై చేయలేదని చెబుతోంది సన్నీలియోన్‌. ఏ మాటకామాటే చెప్పాలి. ఈ గెటప్‌లో సన్నీలియోన్‌ నిజంగానే చాలా బావుంది. కాదు కాదు బావున్నాడు. హెయిర్‌ స్టైల్‌, లైట్‌గా గెడ్డంతో దసరా బుల్లోడులా భలే ముద్దొచ్చేస్తున్నాడు. ఈ గెటప్‌ గురించే ప్రస్తుతం బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ గెటప్‌లో సన్నీ రెడీ అవుతున్న ఫోటోలు, ఫినిషింగ్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

బాలీవుడ్‌ అంతా ఈ కొత్త గెటప్‌లో సన్నీని చూసేందుకు సినిమా కోసం ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మధ్యనే తెలుగులో సన్నీలియోన్‌ 'గరుడవేగ' సినిమాలో నటించింది. 'డియో డియో..' అంటూ ఓ మాస్‌ ఐటెం సాంగ్‌తో ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. రాజశేఖర్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS