కంగ్రాట్స్‌ కేసీఆర్‌ విషెస్‌ ఫ్రమ్‌ సూపర్‌స్టార్‌.!

మరిన్ని వార్తలు

తెలంగాణా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇంకోసారి పీటమెక్కుతున్నారు. బంపర్‌ విక్టరీ సాధించింది కారు పార్టీ. ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ నుండి పలువురు ప్రముఖులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇంకా సగం సీట్లలో కూడా ఫలితాలు పూర్తిగా వెల్లడి కాకముందే సూపర్‌స్టార్‌ కృష్ణ, కేసీఆర్‌కి శుభాకాంక్షలు తెలుపుతూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ట్రెండ్స్‌ చూశాక కృష్ణ నుండి ఈ ప్రకటన అందరి కంటే ముందే విడుదలైంది. ఒకప్పుడు కృష్ణ అంటే కాంగ్రెస్‌ మనిషి. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన రాజకీయ పార్టీలకతీతంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతానికి చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సూపర్‌స్టార్‌ కృష్ణ తనయుడు మహేష్‌బాబు, మంత్రి కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.

బావ గళ్లా జయదేవ్‌ టీడీపీ తరపున ఎంపీగా పని చేస్తున్నా తెలంగాణాలో పరోక్షంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే మహేష్‌ మద్దతిస్తున్నట్లు భావించాలేమో. ఏది ఏమైనా తెలుగు సినీ పరిశ్రమ పట్ల తెలుగుదేశం పార్టీ ఆశించిన స్థాయిలో శ్రద్ధ చూపడం లేదన్న విమర్శల నడుమ తెలంగాణాలో ఈ ఫలితాలు పెద్దగా ఎవర్నీ ఆశ్చర్యపరచలేదు. ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్‌ సత్తా చాటింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS