సూపర్‌ స్టార్‌ ట్రీట్‌ త్వరలో 'దర్బార్‌'లో!

By Inkmantra - September 20, 2019 - 15:00 PM IST

మరిన్ని వార్తలు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'దర్బార్‌' శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ప్రస్తుతం తాజా షెడ్యూల్‌ కోసం 'దర్బార్‌' టీమ్‌ పుణెలో సందడి చేస్తోంది. ఇక్కడ క్లైమాక్స్‌కి సంబంధించిన అతి కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరగనుందట. ఈ సినిమాలో రజనీకాంత్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్లు ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగిస్తున్నాయి.

 

క్లాస్‌, మాస్‌, పక్కా యాక్షన్‌.. ఇలా రకరకాల యాంగిల్స్‌లో ఈ సినిమా నుండి వస్తున్న సూపర్‌ స్టార్‌ పిక్స్‌కి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అయిపోతున్నారు. ఇదిలా ఉంటే, తదుపరి ఇక మిగిలిన లాస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ని విదేశాల్లో తెరకెక్కించనున్నారనీ తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌ మొత్తం పాటల చిత్రీకరణేనట. పాటల కోసం విదేశీ హై అండ్‌ లొకేషన్స్‌ని ఆల్రెడీ ప్లాన్‌ చేసి ఉంచారట. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. యోగిబాబు కీలక పాత్ర పోషిస్తుండగా, నివేదా థామస్‌ మరో ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించనుంది.

 

సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. ఈ లోగా త్వరలోనే టీజర్‌ రిలీజ్‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. రజనీకాంత్‌ నుండి వచ్చే సినిమా అంటే ఎప్పుడూ అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ సారి మురుగదాస్‌ దర్శకత్వంలో వస్తున్న 'దర్బార్‌'పై ఆ అంచనాలు నెక్స్‌ట్‌ లెవల్‌లో ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక త్వరలో రాబోయే టీజర్‌ని బట్టి 'దర్బార్‌'లో అసలు ఏం జరుగుతోందనే విషయంపై ఓ క్లారిటీకి రావొచ్చు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS