తొలి సినిమా 'బీరువా' దగ్గర్నుంచి నటిగా మంచి మార్కులేయించుకోవడానికి చాలా టైమ్ తీసుకుంది అందాల భామ సురభి. అచ్చం 'బొమ్మ'లా కన్పించే ఈ బ్యూటీ, తెరపై నటిగా తొలిసారి మంచి మార్కులు దక్కించుకున్నది 'ఒక్కక్షణం' సినిమాతోనే. హిట్స్ పరంగా చెప్పుకోడానికి 'ఎక్స్‌ప్రెస్‌రాజా', 'జెంటిల్‌మెన్' తదితర సినిమాలున్నా, 'ఒక్కక్షణం' సినిమా ఆమెకు నటిగానూ మంచి గుర్తింపు తెచ్చింది. దానిక్కారణం ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా కొంచెం పెంచడం, దానికి తోడు నటనలోనూ మెచ్యూరిటీ సాధించడం. కాస్త బొద్దుగా తయారైందనే విమర్శల నేపథ్యంలో స్లిమ్ అయ్యేందుకు కష్టపడ్తోంది ఈ బ్యూటీ. ఇకపై ఇటు గ్లామర్‌కీ అటు పెర్ఫామెన్స్‌కీ స్కోప్ ఉన్న సినిమాల్లో నటిస్తానంటోన్న ఈ ముద్దుగుమ్మ, తెలుగులో మాట్లాడేందుకూ ప్రయత్నిస్తోందట. ఏదమైనా బ్యూటీ అంటే సురభినే. ఆమెలో ఆ అమాయకత్వం, అంతకు మించి ఆమె మేనిఛాయ ఆమెని ముందు ముందు స్టార్ హీరోయిన్‌గా మార్చేస్తాయేమో చూడాలిక.