'బీరువా' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ సురభి తాజాగా 'ఒక్క క్షణం' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ బ్యూటీ 'ఎక్స్ప్రెస్ రాజా', జెంటిల్మెన్' సినిమాలతో మంచి హిట్స్ అందుకుంది. గ్లామర్లో అమ్మడికి గీతలేమీ కావు. అయితే తాజా సినిమా 'ఒక్క క్షణం'లో అమ్మడు హాట్నెస్ లెవల్స్ బాగా పెరిగిపోయాయనిపిస్తోంది ఇంతవరకూ వచ్చిన ప్రోమోస్ చూస్తుంటే. అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సురభి, అందాల ఆరబోతకు కొంచెం ఎక్కువే ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు కొంచెం బొద్దుగా కూడా కనిపిస్తోంది. సినిమా సంగతి అలా వుంటే, సినిమా ప్రమోషన్ కోసం క్యూట్ అండ్ హాట్ డ్రెస్సింగ్తో అందర్నీ ఆకట్టుకుంటోంది సురభి. అలా ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఇదిగో ఈ బ్యూటీ ఇలా దర్శనమిచ్చింది. ఫోటోలో సురభి గ్లామర్ కళ్లు చెదిరేలా ఉంది కదా! ఎల్లో కలర్ డ్రస్సులో సురభి అందాలు చూపు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.