'ఒక్క క్షణం' సినిమాతో నటిగా మంచి మార్కులేయించుకుంది ముద్దుగుమ్మ సురభి. కానీ కొంచెం బొద్దుతనం ఎక్కువయ్యిందనే విమర్శలు వచ్చాయి ఈ సినిమా విషయంలో. అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా మంచి విజయం అందుకుంది. అయితే సినిమాలో సురభి బొద్దుతనం గురించే అంతా మాట్లాడుకుంటున్నారు.
నటన పరంగా గత చిత్రాలతో పోల్చితే, కొంచెం పరిణతి చెందిన ఈ బ్యూటీ బొద్దుగా మారిపోవడంపైన అభిమానులు కొంచెం నిరాశ చెందుతున్నారట. దాంతో ఈ బ్యూటీ సన్నబడడానికి జిమ్‌లో ఎక్కువ టైం పాస్ చేస్తోందట. త్వరలో మెరుపుతీగలా కనిపించబోతోందట. అయితే ఇదంతా ఎందుకంటారా? అమ్మడికి ఓ యంగ్ హీరో సరసన లేటెస్టుగా ఛాన్స్ రావడంతోనే అని సమాచారమ్. ఆమెకి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అని తెలియవస్తోంది. హీరోయిన్‌గా ఆమెకి ప్రమోషన్‌లాంటి ఆఫర్ అట ఇది. అందుకే హడావిడిగా జిమ్‌లో కసరత్తులు మొదలెట్టేసిందట ఈ బొద్దు బ్యూటీ.
'ఒక్క క్షణం' సినిమాలో గ్లామర్ బాగా పండించింది. ఇకపై కూడా గ్లామర్ పండించడంలో ఏమాత్రం అభ్యంతరాల్లేవంటోంది. స్లిమ్ అండ్ జీరోసైజ్ ఫిజిక్‌తో ఎక్స్‌పోజింగ్ చేస్తే ఇంకా కిక్కిస్తుందనీ ఈ బ్యూటీ నమ్ముతోందట. అందుకే త్వరలోనే సన్నగా మెరుపుతీగలా మారిన సురభిని చూస్తారంటూ అభిమానులకు సంకేతాలు పంపుతోందీ బ్యూటీ. అసలింతకీ సురభి కొట్టేసిన ఆ గోల్డెన్ ఛాన్స్ ఏంటో..? ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరో..? తెలియాల్సి ఉంది.